AP Treasury: ట్రెజరీ ఉద్యోగులకు మరో షాక్.. ఆదివారం విధులకు రావాలని ప్రభుత్వ ఆదేశాలు

AP govt orders to Treasury employees: ఏపీ ట్రెజరీ సిబ్బంది ఈ ఆదివారం విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 12:47 AM IST
  • ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్
  • ఈ ఆదివారం పనిచేయాలంటూ ఆదేశాలు
  • బిల్లులు ప్రాసెస్ చేయాలని ఆదేశాలు
  • ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు
AP Treasury: ట్రెజరీ ఉద్యోగులకు మరో షాక్.. ఆదివారం విధులకు రావాలని ప్రభుత్వ ఆదేశాలు

AP govt orders to Treasury employees: ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. ట్రెజరీ సిబ్బందికి ఇప్పటికే మెమోలు జారీ చేసిన ప్రభుత్వం.. ఆదివారం  (జనవరి 30) కూడా పనిచేయాల్సిందేనంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10.30గం. నుంచి 5గం. వరకు కార్యాలయాల్లో విధుల్లో ఉండాలని.. ప్రభుత్వం పంపించిన బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నింటికీ శనివారం (జనవరి 29) రాత్రి వాట్సాప్ మెసేజ్‌లు అందినట్లు తెలుస్తోంది.

అంతకుముందు, ట్రెజరీ సిబ్బందికి ప్రభుత్వం మెమోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లులను తక్షణమే ప్రాసెస్ చేయాలని.. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శనివారం (జనవరి 29) సాయంత్రం 6 గంటల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల హెచ్ఓడీలకు ఆదేశాలిచ్చింది.

సాధారణంగా ప్రతీ నెలా 25వ తేదీ కల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు (AP Treasury) ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి పీఆర్సీపై ట్రెజరీ సిబ్బంది కూడా అసంతృప్తితో ఉండటంతో ప్రభుత్వానికి సహకరించట్లేదు. ప్రభుత్వం పలుమార్లు బిల్లుల ప్రాసెస్‌కు ఆదేశాలిచ్చిన సిబ్బంది పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం ట్రెజరీ సిబ్బందికి ప్రభుత్వం మెమోలు జారీ చేసింది.  

Also Read: AP PRC Issue: ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచిన ఏపీ ప్రభుత్వం... ఎంత పెరిగిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News