AP Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించబోతోంది. పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌తో చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలో రేపు ఒక్కరోజే 8 లక్షలమందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు ఓ వైపు వ్యాక్సినేషన్ మరోవైపు కర్ఫ్యూ పగడ్బంధీగా అమలు చేస్తోంది. ఇటు పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై(Corona Vaccination) ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో రెండుసార్లు ఒకే రోజు 6 లక్షల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించింది. రేపు మరోసారి పెద్దఎత్తున రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది. రేపు ఒక్కరోజే ఏకంగా 8 లక్షల వ్యాక్సిన్ డోసులిచ్చేలా లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించాలని తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక కోటి 22 లక్షల 83 వేల 479 వ్యాక్సిన్ డోసుల్ని ప్రభుత్వం (Ap government) అందించింది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులు 5 లక్షల 29 వేలమందికి వ్యాక్సిన్ అందించారు. 26 లక్షల 41 వేలమందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందింది.
Also read: Legislative Council: ఏపీలో శాసన మండలిలో ఆధిక్యం ఇక వైసీపీదే, తగ్గిన టీడీపీ బలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook