Operation Parivartan: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కొనసాగుతున్న గంజాయి సాగుపై ఏపీ ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాల ముఠాలు సాగిస్తున్న గంజాయి సాగును అరికట్టేందుకు ఆపరేషన్ పరివర్తన్ చేపట్టింది.
ఏపీ-ఒడిశా సరిహద్దులో(Andhra Odisha Border) దశాబ్దాలుగా గంజాయి అక్రమ సాగు విస్తరిస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో గంజాయి సాగు వ్యవహారం వార్తల్లోకి రావడంతో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబీలో యధేఛ్ఛగా గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తున్నాయి. గంజాయి అక్రమ సాగును నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాల్ని రంగంలో దింపింది. గంజాయి దందాను పూర్తిగా కట్టడి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఆదేశాలతో పోలీసు శాఖ ప్రత్యేకంగా ఆపరేషన్ పరివర్తన్ చేపట్టింది. దీనికి సంబంధించి ఎస్ఈబీ కమీషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరాను అరికట్టేలా ఆపరేషన్ పరివర్తన్ చేపట్టామని ప్రకటించారు. ఆపరేషన్ పరివర్తన్ (Operation Parivartan) కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామనీ.. ఈ ఆపరేషన్‌లో 80 టీములు పాల్గొన్నాయన్నారు. గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరుజనులు ప్రతిఘటిస్తోన్న సంఘటనలు తక్కువేనని.. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజనులే స్వచ్ఛంధంగా వస్తున్నారని వెల్లడించారు.
దాదాపు150 ఎకరాల్లో గంజాయి పంటని(Cannabis Crop) గిరిజనులే స్వయంగా ధ్వంసం చేశారని.. ఏవోబీలోనే ఈ సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. ఏపీ-ఒడిస్సాల్లో కలిపి మొత్తంగా ఎమిమిది జిల్లాల్లో గంజాయి సమస్య ఉందని తెలిపారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామని.. అలాగే ఇతర ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతోనూ సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడించారు. గంజాయి సాగు, సరఫరా వెనుక గిరిజనులను అడ్డం పెట్టుకుని ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా.. అనే కోణంలోనూ విచారణ చేపడతామనీ..గంజాయి సాగు సమస్యను శాంతి భద్రతల అంశంగా కాకుండా ఆర్ధిక-సామాజిక సమస్యగానే చూస్తున్నాని చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
Also read: YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ చేతికి కీలక ఆధారాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook