Covid vaccination in ap: ఏపీలో కోటిమందికి వ్యాక్సినేషన్..రెండ్రోజులపాటు డ్రై రన్

కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైద్య పరికరాల్ని సమకూర్చుకుంటూ..మరోవైపు డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కోటిమందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

Last Updated : Dec 27, 2020, 10:24 PM IST
  • ఏపీలో కోటిమందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం
  • డిసెంబర్ 28,29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్
  • విజయవాడ గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ కు చేరుకున్న 30 లక్షల డిస్పోజబుల్ సిరంజీలు
Covid vaccination in ap: ఏపీలో కోటిమందికి వ్యాక్సినేషన్..రెండ్రోజులపాటు డ్రై రన్

కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైద్య పరికరాల్ని సమకూర్చుకుంటూ..మరోవైపు డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కోటిమందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) త్వరలోనే ప్రారంభం కానుంది. ఏపీ ( AP ) లో కోటిమందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి వైద్య పరికరాల్ని సమకూర్చుకుంటోంది. ఇప్పటికే గన్నవరం వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్ సిరంజీలు చేరుకున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన ఐస్‌కోల్డ్ రిఫ్రిజిరేటర్లను రప్పించింది ప్రభుత్వం. 

తొలిదశలో వైద్యులు, పారా మెడికల్ , పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు వ్యాక్సినేషన్ ( Vaccination ) చేయనున్నారు. 50 ఏళ్లు పైబడినవారికి కూాడా తొలిదశలోనే వ్యాక్సిన్ వేయనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకు అవసరమైన మెడికల్  పరికరాలు ఒక్కొక్కటిగా కేంద్రం నుంచి చేరుతున్నాయి. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ డోసును చేతికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు అవసరమైన 36 భారీ ఐస్‌లైన్డ్ రిఫ్రిజిరేటర్లు గన్నవరంలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ ( State vaccine centre ) ‌కు చేరాయి. మరో 6 వాక్ ఇన్ కూలర్స్ రానున్నాయి. మూడు కూలర్లలో 40 వేల లీటర్లు, మరో మూడింటిలో 16 వేల 5 వందల లీటర్ల వ్యాక్సిన్ డోసుల్ని భద్రపర్చనున్నారు. 

వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్ల ( Vaccine storage centres )లో 50 సీసీ కెమేరాలు అమర్చి పర్యవేక్షించనున్నారు. గన్నవరం ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, గుంటూరు, కడప, కర్నూలు జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు రేపట్నించి రెండ్రోజుల పాటు అంటే 28,29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ ( Dry run ) కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకూ డ్రై రన్ ఉంటుంది. 

Also read: Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం

Trending News