Ap cm ys jagan: వైద్య సిబ్బందికి వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్‌న్యూస్ విన్పించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2021, 02:47 PM IST
  • టీచింగ్ మెడికల్ స్టాఫ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్‌న్యూస్
  • 7వ పే కమీషన్ ఉత్తర్వుల ప్రకారం వేతనాల పెంపుకు నిర్ణయం
  • వేతనాల పెంపు పట్ల వైఎస్ జగన్‌కు వైద్య సిబ్బంది కృతజ్ఞతలు
Ap cm ys jagan: వైద్య సిబ్బందికి వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్‌న్యూస్ విన్పించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం (Ys jagan government) ఆ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి గుడ్‌న్యూస్ అందించింది. బోధనాసుపత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేస్తున్న వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ చేసింది. వేతన సవరణ ఉత్తర్వులు మార్చ్ 1 నుంచి అమల్లో రానున్నాయి. 7వ సెంట్రల్ పే కమీషన్ ( 7th pay commission) ఫార్ములా ప్రకారం వేతనాల్ని పెంచినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అకాడమిక్ లెవెల్, సీనియార్టీ ఆధారంగా వేతనాల పెంపు నిర్ణయంచారు. గతంలో అంటే 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Ys Rajasekhar reddy) హయాంలో టీచింగ్ హాస్పటల్స్‌లో పనిచేసే వైద్యులకు వేతనాలు పెంచారు. తరువాత అంటే 14 ఏళ్లకు ఇదే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాథ్యతలు చేపట్టాక వైద్యులు ఆయనను కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్..వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో 4 వేలమందికి లబ్ది కలగనుంది. రాష్ట్రంలో మొత్తం 2 డెంటల్ కళాశాలలు, 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలున్నాయి. ఇందులో ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 4 వేలమందికి వేతనాలు పెరగనున్నాయి. 2006 పే స్కేల్ ప్రకారం ప్రొఫెసర్‌కు 37 వేల 4 వందల నుంచి 67 వేల వరకూ వేతనాలున్నాయి. సవరించిన తరువాత ఈ వేతనం 1 లక్షా 44 వేల 2 వందల నుంచి 2 లక్షల 18 వేలకు పెరగనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల వైద్య సిబ్బంది ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan)‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

Also read: SEC vs Nominations: మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News