AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం నుంచి కొత్త జిల్లాలు ఆవిష్కృతం కానున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2019 ఎన్నికల సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ రేపట్నించి అమల్లో రానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 4 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్యలో రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందగర్భంగా 26 కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 26 జిల్లాల కలెక్టర్లు ఎవరో పరిశీలిద్దాం..
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీరావు కొనసాగించనున్నారు. ఇక విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఇప్పుడున్న సూర్యకుమారి వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగనున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా మాధవీలతలు నియామకమయ్యారు.
ఇక కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా పి.ప్రశాంతి , ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌లను నియమించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా ఎస్.దిల్లీరావు, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్ నియమితులయ్యారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్ బాబులను నియమించారు. శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్ కుమార్ ,అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి, నంద్యాల జిల్లా కలెక్టర్‌గా మనజీర్ జిలాని శామూన్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావులు నియమితులయ్యారు. ఏప్రిల్ 4 నుంచి కొత్త కలెక్టర్‌లు బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also read: Ugadi Celebrations: ఉగాది వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.