ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2021, 09:24 PM IST
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం (Ap government)కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 3.144 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెంచిన డీఏను 2019 జనవరి 1 నుంచి వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రెండున్నరేళ్ల డీఏ ఎరియర్స్ ఒక్కసారిగా అందనున్నాయి. డీఏను 3.144 శాతానికి పెంచడంతో మొత్తం డీఏ పర్సంటేజ్ 33.53 శాతానికి చేరింది. 2021 జూలై నుంచి పెంచిన డీఏతో కలిపి పెన్షన్ చెల్లించనున్నారు. బకాయి పడ్డ డీఏను వాయిదాల్లో చెల్లించనుంది ప్రభుత్వం. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడవ డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధికశాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.39 శాతానికి పెన్షనర్ల డీఏను(DA Hike)పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా పెంచిన డీఏను 2019 నుంచి వర్తింపజేయడం ఉద్యోగుల్లో ఆనందాన్ని కల్గిస్తోంది. 

Also read: ఏపీ మెగా ఐటీ హబ్‌గా విశాఖపట్నం, ఐటీ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News