Covid Vaccine: వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 10, 2021, 05:38 PM IST
 Covid Vaccine: వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది.

ఏపీలో గత కొద్జిరోజులుగా వ్యాక్సినేషన్(Vaccination)కార్యక్రమం, వ్యాక్సినేషన్‌పై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy) స్పందించారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ5 లతో పాటు చంద్రబాబు అండ్ కో పనిగట్టుకుని వ్యాక్సినేషన్‌పై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు ఓ వైపు వాస్తవం ఏంటనేది చెబుతున్నా..దుష్ప్రచారం ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు(Vaccine purchase) చేయడం లేదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ (Central government) నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు పంపాలనే దానిపై స్పష్టమైన నిబంధనలున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్ కేటాయింపు విషయంలో కేంద్ర టాస్క్ ఫోర్స్ మానిటరింగ్ చేస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ఇదే విషయం ఉందన్నారు. 

కోవిడ్ కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ap cm ys jagan) ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. అసలు చంద్రబాబు, లోకేష్‌లు వ్యాక్సినేషన్ వేయించుకున్నారా లేదా..వేయించుకుని ఉంటే ఏపీలోనా లేదా హైదరాబాద్‌లోనా అని సజ్జల ప్రశ్నించారు. అతి నీచమైన తత్వం చంద్రబాబు(Chandrbabu) దని దుయ్యబట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ డీ లైసెన్సింగ్ చేసే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థలో చర్చలు జరుగుతున్నాయన్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పేటెంట్‌ ( Bharat Biotech Vaccine patent)పై కేంద్రానికి కూడా హక్కుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. భారత్ బయోటెక్ కంపెనీ పేటెంట్‌ను డీ లైసెన్సింగ్ చేసి ఉత్పత్తి పెంచాలని కేంద్రానికి వైఎస్ జగన్ లేఖ రాస్తారన్నారు. రాష్ట్రానికి రావల్సిన వ్యాక్సిన్, ఆక్సిజన్ కోసం అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.

Also read: Covid Border Dispute: ఏపీ అంబులెన్స్‌లను అడ్డుకుంటున్న తెలంగాణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News