AP: మీరు విచారణ నుంచి తప్పుకోండి: హైకోర్టులో ప్రభుత్వ అఫిడవిట్

ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

Last Updated : Dec 16, 2020, 10:54 AM IST
  • కేసు విచారణ నుంచి తప్పుకోవల్సిందిగా జస్టిస్ రాకేశ్ కుమార్ ను విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసు విచారణ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరం
  • కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారని చెబుతున్న ప్రభుత్వం
AP: మీరు విచారణ నుంచి తప్పుకోండి: హైకోర్టులో ప్రభుత్వ అఫిడవిట్

ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఏపీ ( AP ) లో న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి ( Government ) మధ్య ఘర్షణ చెలరేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు ( Supreme court )కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )లేఖ కూడా రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కన్పిస్తోంది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ( Mission Build Andhra pradesh )‌లో భాగంగా ప్రభుత్వ ఆస్థుల్ని వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పుకోవల్సిందిగా జస్టిస్ రాకేశ్ కుమార్ ( justice Rakesh kumar )‌ను అభ్యర్ధిస్తూనే ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

కేసు విచారణలో జస్టిస్ రాకేశ్ కుమార్ సభ్యుడిగా కొనసాగితే న్యాయం జరిగే అవకాశముండదని ప్రభుత్వం హైకోర్టు ( Ap High court )కు స్పష్టం చేసింది. ఒక న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించే అవకాశముందనే సహేతుకమైన ఆందోళన ఉన్నప్పుడు విచారణ నుంచి తప్పుకోమని కోరవచ్చనే సుప్రీంకోర్టు తీర్పును అఫిడవిట్‌లో దాఖలు చేసింది ప్రభుత్వం. కేసు విచారణకు ముందే ఓ నిర్ణయాానికి వచ్చి..ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలే పక్షపాతంతో వ్యవహరిస్తారనేందుకు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగం వైఫల్యం చెందిందని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం అవసరం లేనిదని ప్రభుత్వం తెలిపింది. 

విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఆస్థుల వేలం నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా ఈ నెల 11న జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణ ఈ నెల 17 న జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వం జస్టిస్ రాకేశ్ కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవల్సిందిగా అఫిడవిట్ ( Affidavit ) దాఖలు చేసింది. వినియోగంలో లేకుండా ఆక్రమణలో ఉండి వివాదాల్లో చిక్కుకున్న ఆస్థుల్ని వేలం వేసి విక్రయించే అధికారం ప్రభుత్వానికుందా లేదా అనేది కోర్టు తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై విచారణ జరిపి నిర్ణయం ప్రకటింంచాల్సింది పోయి..రాజ్యాంగం వైఫల్యం చెందిందని చెప్పడం ఏ మాత్రం అవసరం లేనివని ప్రభుత్వం చెప్పింది. 

కోర్టులో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కాస్సేపటికే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల్లో వైరల్ అయ్యాయి.  ఆ వ్యాఖ్యల్ని ప్రచురించిన పత్రికల క్లిప్పింగుల్ని కూడా అఫిడవిట్‌కు జత చేర్చారు. Also read: AP: ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

Trending News