Botsa Satyanarayana on DSC Notification: ఎప్పటి నుంచో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. ఈ మేరకు డీఎస్సీపై ప్రకటన చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై కూడా సమీక్షించామని తెలిపారు. త్వరలోనే బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని.. ఇందుకు సంబంధించి పారదర్శకమైన విధానాన్ని తీసుకువస్తామన్నారు. ఇతర రాష్ట్రాలలో అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
విశాఖే తమ పరిపాలన రాజధాని అంటూ మరోసారి స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజధాని అమరావి అయితే.. చంద్రబాబు హైదరాబాద్‌లో కాపురం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాపురానికి.. రాజధానికి సంబంధం ఏంటని అడిగారు. డైవర్షన్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు తాము వ్యతిరేకం అని.. కొందరు బాధ్యరాహిత్యంగా మాట్లాడారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.
రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బొత్స అన్నారు. చంద్రబాబు మంచి నటుడు.. మ్యానిపులేటర్ అని ఫైర్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం కూడా పరిశీలిస్తున్నామన్న బొత్స.. ఈ సమస్య పరిష్కరానికి సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేయలేదని.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు ఉండడంతోపాటు ఒంటి పూట బడుల కారణంగా చిక్కిలు ఇస్తున్నామని తెలిపారు.
Also Read: Viveka Murder Case Latest Update: డీఎన్‌ఏ టెస్టుకు రెడీ.. అప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్
కాగా.. ఉద్యోగుల పెండింగ్ డీఏపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెండింగ్ డీఏ బకాయిల విడుదలతో పాటు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కూడా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. డీఏకు సంబంధించిన ఓవో ఈ నెలలోనే రానుండగా.. ఉద్యోగుల బదిలీలు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook