YS Sharmila: సూపర్ సిక్స్-సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ షర్మిల కౌంటర్ ఎటాక్

YS Sharmila Fires on CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సూపర్ సిక్స్‌ హామీలపై ఆమె నిలదీశారు. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో పాలన గాడిన పెడతామన చెప్పి.. ఓట్లు వేయించుకున్న తరువాత మోసం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 28, 2025, 11:44 AM IST
YS Sharmila: సూపర్ సిక్స్-సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ షర్మిల కౌంటర్ ఎటాక్

YS Sharmila Fires on CM Chandrababu Naidu: కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి.. డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని.. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట అంటున్నారని అన్నారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు అంటూ సెటైర్లు వేశారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని.. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని మండిపడ్డారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని.. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని విమర్శించారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని కూటమిపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

"పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్  గారి ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం. 'సూపర్ సిక్స్' పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసం..? 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టండి. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టండి. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగండి. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా  గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించండి. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చండి. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండి." అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: Mauni Amavasya 2025: మహాకుంభమేళాలో రేపు మిస్సయితే.. మళ్లీ జన్మజన్మలకు ఈ అదృష్టం రాదు

Also Read: Andariki Illu Scheme: అందరికీ ఇళ్లు పధకానికి లబ్దిదారులెవరు, ఎవరెవరికి అర్హత ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News