AP CM YS Jagan's Delhi tour schedule on 3rd January, 2022 : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రంం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీతో.. సీఎం జగన్ (CM Jagan) భేటీ అవుతారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో.. జగన్ చర్చించనున్నట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) రేపటి ఢిల్లీ షెడ్యూల్ ఇలా ఉండనుంది. రేపు ఉదయం 10.20కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. (Prime Minister Narendra Modi) సీఎం జగన్ భేటీ అవుతారు.
Also Read : Rahul Dravid on Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు.. అతడొక అద్భుతమని కితాబు
అయితే జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో (AP politics) హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానితో జగన్ ఏ విషయాలపై చర్చించనున్నారనే ఆసక్తి నెలకొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై జగన్..మోదీతో చర్చించనున్నారని టాక్. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా మోదీతో పాటు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) అంశం కూడా చర్చకు రానున్నట్లు సమచారం. అలాగే విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలను కూడా జగన్.. (Jagan) మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొస్తారని తెలుస్తోంది.
Also Read : Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook