Ys Jagan: వై నాట్ 175, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధీమా ఇదే

Ys Jagan: వై నాట్ 175. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. ఈ ధీమా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో లేదో గానీ..ప్రత్యర్ధుల్ని మాత్రం కలవరపెట్టిస్తోంది. ఎందుకింత ధీమా అనే ఆలోచనలో పడ్డారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2022, 03:57 PM IST
Ys Jagan: వై నాట్ 175, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధీమా ఇదే

ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 16 నెలల సమయం మిగిలుంది. ప్రతిపక్షాలకంటే అధికార పార్టీనే ఎన్నికలకు సిద్ధంగా..దూకుడు ప్రదర్శిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వై నాట్ 175 అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇప్పట్నించి పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ది ఇంటి వరకూ చేరిందని నమ్మితేనే ఓటేయమని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి గడపకు చేరాయనేది వైఎస్ జగన్ పూర్తి నమ్మకం. అందుకే అంత ధీమాగా వై నాట్ 175 అనడం గానీ, సంక్షేమ పధకాలు ఇంటికి చేరితేనే ఓటేయమని కోరడం గానీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా.

మరోవైపు రాష్ట్రంలోని 2.5 లక్షల వాలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా పార్టీ తరపున 5 లక్షలమంది గృహ సారధుల నియామకం జరగనుంది. ఇది నిజంగా అద్భుతమైన వ్యూహమే. ఈ వ్యూహంతో ప్రతి ఇంటి గురించి పూర్తి వివరాలు అధినేత వద్ద ఉంటాయి. అంటే సంక్షేమం విషయంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినా లేదా ఎవరైనా మిస్సైనా వెంటనే సరి చేసుకునేందుకు వీలవుతుంది. 

ఇక మరో వ్యూహం మూడు రాజధానుల అంశం. ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ యోచిస్తోంది. ఎందుకంటే అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదనే భావనను ప్రజల్లో తీసుకెళ్లేందుకు పూర్తిగా కసరత్తు జరుగుతోంది. అభివృద్ధి లేదని వాదించేవారికి మూడు రాజధానుల అంశం ద్వారా సమాధానం చెప్పాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. 

ఇక చివరి అస్త్రం బీసీ కార్డు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ బీసీ కార్డు వ్యూహం అమలు చేసి పూర్తిగా విజయవంతమైంది. జనరల్ కేటగరీ స్థానాల్లో వీలైనంతవరకూ ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయించాలనేది పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ ఓట్లే అత్యధికం. రాష్ట్రంలో బీసీ ఓటింగ్ నిర్ణయాత్మక దశలో ఉంది. 

Also read: Sajjala on Pawan: చప్పట్లు కొట్టించుకునేందుకు ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ అంతా అక్కడి స్క్రిప్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News