Free Sanitary Napkins: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్య రక్షణ, విద్యకు విఘాతం లేకుండా ఉండేందుకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో మరో గొప్ప పథకానికి అంకురార్పణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయనుంది. శానిటరీ న్యాప్‌కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఫలితంగా బాలికల విద్యకు విఘాతం కలుగుతోంది. ఈ నేపధ్యంలో అన్ని ప్రభుత్వ స్కూళ్లు, పాఠశాలల్లో చదువుతున్న 12-18 ఏళ్ల విద్యార్ధినులకు ప్రభుత్వం ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్(Sanitary Napkins) అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో కౌమార దశ బాలికలు 12.50 లక్షలున్నట్టు అంచనా. ఒక్కొక్కరికీ ఏడాదికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావల్సివస్తాయి. దీనికోసం 41.4 కోట్ల నిధులు అవసరమవుతాయి.
మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని వైఎస్సార్ చేయూత (Ysr Cheyutha) దుకాణాల్లో శానిటరీ న్యాప్‌కిన్స్‌ను మహిళలకు తక్కువ ధరకే విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్లకు సిద్ధమవుతున్నాయి. శానిటరీ న్యాప్ కిన్లను లబ్దిదారులకు ఎల్-1 రేటు కంటే 15 శాతం తక్కువ మార్జిన్‌కు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్స్ 35 వేల 105 ఉండగా, పట్టణాల్లో 31 వేల 631 ఉన్నాయి. రాష్ట్రంలో 18-50 ఏళ్ల వయస్సున్న మహిళల సంఖ్య దాదాపు 1.26 కోట్లు ఉంటుందని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం రాష్ట్రంలో 15-24 ఏళ్ల వయస్సున్న 67.50 శాతం మహిళలలు నెలవారీ పరిశుభ్రమైన పద్దతిని అనుసరిస్తున్నారు. సర్వే నివేదికల్ని, పేదరికాన్ని, దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం (Ap government) బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.
Also read: Vizag Development: చంద్రబాబు హయాంలో జరిగిందంతా దోపిడీనే: మంత్రి బొత్స సత్యనారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Free Sanitary Napkins: ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల విద్యార్ధినులకు ఉచితంగా శానిటరీ
ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లోని విద్యార్దినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం
12-18 ఏళ్ల వయస్సున్న విద్యార్ధినులకు ఏడాదికి 120 న్యాప్‌కిన్స్ చొప్పున పంపిణీకు నిర్ణయం