YS Jagan Review: పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో టికెట్.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?

YS Jagan Review: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. తీరు మారకుంటే నో టికెట్ అంటూ సంకేతాలిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2023, 08:05 PM IST
YS Jagan Review: పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో టికెట్.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?

YS Jagan Review: ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నికలు సమీపిస్తుండటంతో పనితీరుపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గ్రాఫ్ మెరుగుపర్చుకోకపోతే టికెట్ ఉండదంటున్నారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేలకు ఆ దిశగా సంకేతాలు అందినట్టు సమాచారం.

ఎన్నికల సమీపించే కొద్దీ ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమౌతూ వివిధ అంశాలపై సమీక్ష జరుపుతున్నారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో175కు 175 సీట్లు సాధించి తీరాలని పదే పదే చెబుతున్న జగన్..ఇవాళ జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి టార్గెట్ గుర్తు చేశారు. అక్టోబర్ వరకూ గడువిచ్చి పనితీరు ఇకనైనా మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈలోగా గ్రాఫ్ పెరిగితే సరి లేకుంటే మీతోపాటు పార్టీకు కూడా నష్టమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 18 మందికి ఈ దిశగా ఇప్పటికే సంకేతాలు కూడా పంపించారట.

ఇవాళ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు అంతా హాజరయ్యారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని, ఆ 18 మందిని వ్యక్తిగతంగా కలుస్తానని స్పష్టం చేశారు. ఇక మిగిలినవారిలో కూడా సగం మంది పనితీరు ఇంకా మెరుగుపడాలని సూచించారు. పనితీరు సరిగ్గా లేనప్పుడు వారితో పాటు పార్టీకు కూడా నష్టం వాటిల్లుతుందని పరోక్షంగా టికెట్ ఉండదంటూ హెచ్చరించారు. పనితీరు ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుందని, చివరి క్షణంలో టికెట్ రాలేదని తనను బాధ్యుడిని చేయవద్దని స్పష్టం చేశారు. 

Also Read: Margadarsi Case: మార్గదర్శికి మరో షాక్, 23 చిట్ గ్రూపులు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ

రానున్న రోజుల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంతో పాటు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ప్రతి సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి సమస్య పరిష్కారం కావాలన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనివారు ఎవరూ ఉండకూడదన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. 

Also Read: Heavy Rains Alert: విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, ఆ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News