ఏపీ రాజధాని విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం ఇచ్చేశారు. మొన్న ఢిల్లీ..ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రాజధానిపై వివరణ ఇచ్చారు. త్వరలో విశాఖకు షిఫ్ట్ కానున్నట్టు చెప్పడం విశేషం.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలిరోజు లంచ్ నాటికి చాలా అంశాలపై క్లారిటీ వచ్చింది. ఓ వైపు భారీగా పెట్టుబడులపై ప్రకటన వెలువడగా, పెద్దఎత్తున ఎంవోయూలు కూడా పూర్తయ్యాయి. తొలిరోజు ఊహించిన రీతిలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరిగాయి. మొదటి రోజు 92 ఒప్పందాలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 20 రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. రెండ్రోజుల్లో 340 ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు. రాష్ట్రంలో త్వరలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ నెలకొల్పనున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించగా, 15 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థాపిస్తున్నట్టు అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. వీటికితోడు ఏపీలో ఈపాటికే ఉన్న పెటుబడుల్ని కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సులభమైన పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే..ఒక్క ఏపీలోనే 3 ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలు ఎవరికి ఎప్పుడు ఏ అవసరమొచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానన్నారు. త్వరలో విశాఖ ఏపీకు పరిపాలన రాజధాని కానుందని..తాను కూడా విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని వైఎస్ జగన్ చెప్పారు.
గతంలో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సు ఢిల్లీలో ఏర్పాటు చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రాజధానిపై క్లారిటీ ఇచ్చారు త్వరలో విశాఖ నుంచే పరిపాలన చేస్తాన్నారు. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. ఈలోగా విశాఖ రాజధాని విషయంపై ప్రకటన చేయడం, విశాఖ పరిపాలనా రాజధాని కల సాకారం కానుందని చెప్పడం గమనార్హం.
Also read: GIS 2023 Updates: ఏపీలో విద్యుత్ రంగంలో అదానీ, అంబానీల భారీ పెట్టుబడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook