Ys Jagan Delhi Tour: వైఎస్ జగన్ రెండ్రోజులు ఢిల్లీలో బిజీ, పర్యటన వివరాలివీ

Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ మంత్రులతో కీలక సమావేశం కానున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2021, 04:11 PM IST
  • ఢిల్లీ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • రెండ్రోజులపాటు ఢిల్లీలో వివిధ మంత్రులతో సమావేశం
  • పోలవరం ప్రాజెక్టు, ఇతర రాష్ట్ర అంశాలపై చర్చ
Ys Jagan Delhi Tour: వైఎస్ జగన్ రెండ్రోజులు ఢిల్లీలో బిజీ, పర్యటన వివరాలివీ

Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ మంత్రులతో కీలక సమావేశం కానున్నారు.

రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకట రమణలు జగన్‌కు స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై వివిధ మంత్రులతో చర్చించనున్నారు. రెండ్రోజుల పర్యటనలో (Delhi Tour) భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తదితరుల్ని కలవనున్నారు. 

ముందుగా పోలవరం ప్రాజెక్టుకు(Polavaram Project) సంబంధించి జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ కానున్నారు. పోలవరం నిధులు, పెండింగ్ అంశాల్ని చర్చిస్తారు. పోలవరంతో సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. చివరిగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit shah) భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలపై కేంద్ర సహకారాన్ని కోరనున్నారు. రెండవ రోజు అంటే రేపు ఉదయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అంటే రేపు మధ్యాహ్నం ఏపీకు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, బాలశౌరిలు ఉన్నారు. 

Also read: AP Curfew Timings: రేపట్నించి ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు, కొత్త టైమింంగ్స్ ఇవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News