సీఎం జగన్: వర్షాల కారణంగా మృతి చెందితే రూ.5లక్షలు..ముంపు బాధితులకు రూ.2వేలు..

వరద సహాయక చర్యలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 12:25 PM IST
  • వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
  • ముంపు బాధితులకు రూ.2వేల తక్షణసాయం
  • వరద సమీక్షకు ప్రత్యేక అధికారులు నియామకం
సీఎం జగన్: వర్షాల కారణంగా మృతి చెందితే రూ.5లక్షలు..ముంపు బాధితులకు రూ.2వేలు..

CM Jagan Review on Rains: కుండపోత వర్షాలు(Heavy Rains) ఏపీలోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్(CM Jagan)..ఐదుజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్షలో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు.

చెరువులకు గండ్లు పడిన చోట తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సూచించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల తక్షణ సాయం అందించాలని సీఎం(CM Jagan) ఆదేశించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలన్నారు. వర్షాల తర్వాత వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు జగన్‌ సూచించారు.

Also Read: కడప: చెయ్యేరు నదికి పోటెత్తిన వరద..30 మంది గల్లంతు..ముగ్గురు మృతి..

వరద సమీక్షకు ప్రత్యేక అధికారులు..
వరద పరిస్థితి(Flood condition)ని సమీక్షించేందుకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారుల(Special Officers)ను నియమించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు... గురువారం రాత్రి అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో చేపట్టవలసిన సహాయ చర్యలను అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. వాటిని నివేదిక రూపంలో సీఎంకు అందజేస్తారు. నెల్లూరు జిల్లా(Nellore District)కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లా(Chittoor District)కు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, కడప జిల్లా(Kadapa District)కు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News