రైతన్నలకు ఏపీ సర్కార్ 'సంక్రాంతి' బంపర్ కానుక

Last Updated : Jan 16, 2018, 12:26 PM IST
రైతన్నలకు ఏపీ సర్కార్ 'సంక్రాంతి' బంపర్ కానుక

రైతులకు ఏపీ సర్కార్ సంక్రాంతి కానుకను ప్రకటించింది. వ్యవసాయం కోసం ఉచితంగా 15 లక్షల ఇంధన పొదుపు పంపు సెట్లు పంపిణీ చేయనుంది. అయితే దీన్ని దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2018-19 ఏడాదికి 4  లక్షల నుంచి 5 స్టార్ పంపు సెట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

మొబైల్ తో పనిచేసే పంపుసెట్లు..
రైతులకు పంపిణీ చేసే ఒక్కో పంపు సెట్టు రూ.40 వేలు పలుకుతోంది. వీటికి ఐదేళ్ల వరకు ఎలాంటి నిర్వహణ,మరమ్మతుల ఖర్చు ఉండదు. పైగా ఈ పంపు సెట్లతో దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.  మొబైల్ తో పనిచేయడమే  దీని ప్రత్యేకత. దీంతో అర్థరాత్రి పొలాలకు వెళ్లి పంపు సెట్లు వేసే పరిస్థితి ఇక ఉండకపోవచ్చు. దీని వల్ల పాముకాట్లు వంటి ప్రమాదాలు తప్పుతాయి.

రూ.55వేలకే సోలార్ పంపు సెట్
భూగర్భ జలాలు ఎక్కవ లోతు ఉన్న ప్రాంతాల వారికి కోసం మరో పథకాన్ని ప్రవేశపెట్టనుంది. భూగర్భ జలాలు 75 మీటర్ల లోతు ఉన్న ప్రాంతాల్లో రైతులకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పంపు సెట్ విలువ  3.12 లక్షలు కాగా మిగిలిన 2.57 లక్షలు ప్రభుత్వం సబ్సీడీ చెల్లిస్తుంది. అంటే ఈ సోలార్ పంపు సెట్ కోసం ఒక్కో  రైతు  రూ.55 వేల చెల్లిస్తే సరిపోతుందన్నమాట.

Trending News