YS Jagan: మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దికాలంగా రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణంపై సమీక్షించారు. అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2021, 07:00 PM IST
  • ఏపీ రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • రాష్ట్రంలోని రోడ్లను తక్షణం యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని ఆదేశాలు
  • రాష్ట్రంలోని మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ జగన్
 YS Jagan: మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దికాలంగా రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణంపై సమీక్షించారు. అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. 

ఏపీలోని రోడ్ల పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా అధ్వాన్నంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఏపీలోని రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తూ..అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు. 

అక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ది చేయాలని..వచ్చే వర్షాకాలంలోగా రోడ్లన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని..తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress party) అధికారంలో వచ్చిన తరువాత ప్రతి యేటా మంచి వర్షాలు పడ్డాయని..దాంతో రైతులు సంతోషంగా ఉన్నా రోడ్లు మాత్రం దెబ్బతిన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. వనరుల సమీకరణకు అనేక చర్యలు తీసుకుంటూ..ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరోవైపు రోడ్ల పరిస్థితిపై విమర్శలు చేస్తున్న మీడియాపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. దురదృష్ఠవశాత్తూ చంద్రబాబుతోనే కాకుండా పచ్చ మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు(Chandrababu)లేకపోవడంతో జీర్ణించుకోలేక ప్రతి విషయాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. ఎవరెంత వ్యతిరేక ప్రచారం చేసినా..చేయాల్సిన పనులు చేద్దామని సూచించారు. పనులన్నీ బాగా చేస్తే నెగెటివ్ మీడియా ఎన్ని రాసినా సరే..ప్రజలు గమనిస్తారన్నారు. రోడ్లు బాగు చేసేందుకు చాలా టెండర్లు పిలిచామని..ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Also read: AP Corona Update: ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, 24 గంటల్లో కేవలం 739 కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News