అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంగన్ వాడీ జీతాల పెంపు, కౌలు రైతులకు సాగు ఒప్పందం, స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకం, ఆక్వాకు చౌక ధరకే విద్యుత్ సరఫరా, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత తదితర బిల్లులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు మద్య నిషేధం చర్యలో భాగంగా మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వం నిర్వహించేలా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది
* మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వం నిర్వహించేలా రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం
* కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందిన బిల్లుకు గ్నీన్ సిగ్నల్.
* గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ఆమోదం. నెలకు రూ. 5 వేల జీతం బిల్లుకు కేబినెట్ ఆమోదం
* అంగన్ వాడీ జీతాల పెంపుకు సంబంధించిన బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
* గడువు తీరిన జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.
* ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే సరఫరా కు కేబినెట్ ఆమోద ముద్ర
* ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
* ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే ఇవ్వాలని కేబినెట్ ఆమోదం
* ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై చట్టసవరణకు కేబినెట్ ఆమోదం
*నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించే ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కు కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఏపీఐఐసీకి 149 ఎకరాల అప్పగింతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
* ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ప్రక్రియకు కేబినెట్ ఆమోదం