Kanna Lakshminarayana: బీజేపీకు రాజీనామా, సైకిల్ ఎక్కనున్న కన్నా, చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి

Kanna Lakshminarayana: అనుకున్నదే జరిగింది. పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది. బీజేపీకు ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసేశారు. ఇక నెక్స్ట్ ఏంటి, కన్నా లక్ష్మీ నారాయణ పయనం ఎటువైపనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 16, 2023, 02:37 PM IST
Kanna Lakshminarayana: బీజేపీకు రాజీనామా, సైకిల్ ఎక్కనున్న కన్నా, చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి

ఏపీ బీజేపీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకు గుడ్‌బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ప్రత్యామ్నాయ పార్టీలుగా జనసేన, టీడీపీలో దేనిలో చేరనున్నారనేది కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. 

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన్ని తొలగించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల అయితే పూర్తిగా దూరమయ్యారు. సొంత పార్టీ నేతలపై ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. త్వరలోనే బీజేపీకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం చాలా కాలంగా విన్పిస్తోంది. మొత్తానికి ఊహించిందే జరిగింది. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపించడమే కాకుండా..రాజీనామాకు కారణాన్ని కూడా అందులో ప్రస్తావించారు. సోము వీర్రాజు తీరు కారణంగానే పార్టీ వీడాల్సివచ్చిందని రాజీనామా లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. 

సరే బీజేపీని వదిలేశారు. మరిప్పుడు తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటువైపు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ జనసేన తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారమే గట్టిగా సాగింది. ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్..ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కూడా. కానీ ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారాయి. ఇప్పుడు జనసేన కాదని..తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు కొందరు కన్నాతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 23,25 తేదీల్లో కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

వాస్తవానికి జనసేనలో చేరాలని అనుకున్నది నిజమే. కానీ టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత లేకపోవడంతో మనసు మార్చుకున్నారని సమాచారం. ఏ పార్టీలో ఉన్నా..కన్నా ఆశిస్తున్నది మాత్రం సత్తెనపల్లి స్థానం. టీడీపీ నుంచి దీనికి సంబంధించి హామీ ఇప్పటికే తీసుకున్నారని సమాచారం. అంటే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్ధి, మంత్రి అంబటిపై పోటి పడేందుకు కన్నా సిద్ధమయ్యారు. 

Also read: AP Capital City: త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన: మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News