నిరవధికంగా వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

గత ఐదు రోజులుగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Last Updated : Jun 18, 2019, 10:45 PM IST
నిరవధికంగా వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

అమరావతి: గత ఐదు రోజులుగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. తొలిరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించగా, రెండో రోజు సభ్యులంతా కలిసి స్పీకర్‌ను ఎన్నుకున్నారు. మూడో రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాలుగవ రోజు, ఐదవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతోపాటు ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపైనా చర్చ జరిగింది. 

ఐదు రోజులుగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో 19.25 గంటలపాటు సభ జరగగా మొత్తం 175 మంది సభ్యులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వినిపించారు.

Trending News