Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు తప్పవు

Weather Updates: మాండస్ తుపాను నుంచి తేరుకునేలోగా మరో అల్పపీడనం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2022, 05:16 PM IST
Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు తప్పవు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలిగాలులు పెరుగుతున్నాయి. మాండస్ తుపాను ప్రభావంతో వారం రోజుల్నించి వాతావరణం మరింత చల్లబడింది. ఇప్పుడు మరో అల్పపీడనం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

మాండస్ తుపాను తీరం దాటి మూడ్రోజులైనా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు తగ్గలేదు. దీనికితోడు శీతాకాలం కావడంతో చలి మరింతగా పెరుగుతోంది. అటు చలిగాలులు, ఇటు వర్షాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మాండస్ తుపాను ప్రభావం ఇప్పుడు దాదాపుగా తగ్గినా..ఇంకా చాలావరకూ వాతావరణం మేఘావృతమై ఉంటోంది. ప్రస్తుతానికి ఈ మేఘాలు ఏపీపై ఎక్కువగా ఆవరించి ఉన్నాయి. అటు తెలంగాణలో సైతం కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఆవహించి ఉన్నాయి. దాంతో ఇంకా వర్షాలు అక్కడక్కడా కొనసాగుతున్నాయి.

దీనికితోడు ఇవాళ లేదా రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలులు వేగంగా వీస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే  ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని భావిస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా ఉంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో చలి మరింతగా పెరగనుంది.

బంగాళాఖాతం మీదుగా వీస్తున్న చల్లని గాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. చలికి తోడు పొగమంచు సమస్యగా మారుతోంది. ప్రతియేటా డిసెంబర్, జనవరి నెలల్లో ఇదే పరిస్థితి ఉంటుంది.

Also read: AP Cabinet Decisions: జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు, ఇకపై 2750 రూపాయలు, కేబినెట్ నిర్ణయాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News