Covidshield vaccines: రాష్ట్రానికి భారీగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు

Covidshield vaccines: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరిన ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2021, 06:54 PM IST
Covidshield vaccines: రాష్ట్రానికి భారీగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు

Covidshield vaccines: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరిన ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.

ఏపీలో వ్యాక్సినేషన్ (Vaccination) వేగం పుంజుకోనుంది. రాష్ట్రానికి పెద్దఎత్తున 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine) డోసులు చేరుకోవడంతో కొంతవరకూ వ్యాక్సిన్ కొరత తీరనుంది. విజయవాడ విమానాశ్రయానికి చేరిన 9 లక్షల వ్యాక్సిన్ డోసుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ రిలాక్స్ అవ్వొద్దని..నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 

రాష్ట్రంలో కోవిడ్ వైరస్ జీరో స్థాయికి చేరుకుందని అనుకోవద్దని..ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని చెప్పారు. కోవిడ్ 19 నియంత్రణ, వ్యాక్సినేషన్, కరోనా థర్డ్‌వేవ్‌పై (Corona Third Wave) ముఖ్యమంత్రి వైఎస్ జగన్  సమీక్ష సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరిస్తున్న వ్యూహం మంచి ఫలితాలనిచ్చింది. జూన్ 20 తరువాత కర్ఫ్యూ కొనసాగిస్తూనే మరికొంత సడలింపులు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో పాజిటివ్ రేటు కూడా తగ్గుతోంది. 

Also read: AP Exams: ఏపీలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News