అప్పటి వరకు ట్రాఫిక్ చలానాలు పెంచం: ఏపీ రవాణా శాఖ వివరణ

అప్పటి వరకు ట్రాఫిక్ చలానాలు పెంచం: ఏపీ రవాణా శాఖ వివరణ

Last Updated : Aug 31, 2019, 09:25 AM IST
అప్పటి వరకు ట్రాఫిక్ చలానాలు పెంచం: ఏపీ రవాణా శాఖ వివరణ

అమరావతి: కేంద్రం దేశవ్యాప్తంగా పెంచిన ట్రాఫిక్ చలానాలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకొస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెరిగిన చలాన్ల వసూళ్లపై శుక్రవారం ఏపీ రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. తాము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఏపీ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసే వరకు కేంద్రం పెంచిన వాహన చలాన్లు వసూలు చేయబోమని రవాణాశాఖ అధికారులు తేల్చిచెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయిన తర్వాతే పెరిగిన చలానాలు వసూలు చేస్తామని, అప్పటి వరకు పాత పద్ధతిలోనే చలానాలు విధిస్తామని అధికారులు వెల్లడించారు.

Trending News