AP Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో మైలురాయి దాటింది.
ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination)వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేక డ్రైవ్‌లతో ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తమైంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరో రికార్డు సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మైలురాయి దాటిన ఘనత సాధించింది. ఆరు కోట్ల జనాభా కలిగి రాష్ట్రలో సగం మందికి వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. కేంద్రం(Central government)నుంచి వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా వస్తే..త్వరలోనే అంటే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటోంది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల సహకారంతో ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇవాళ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో దాదాపు 9 లక్షలమందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3 కోట్ల 87 వేల 377 మందికి వ్యాక్సిన్ అందించారు. తొలిడోసు వ్యాక్సిన్ 2 కోట్ల 16 లక్షల 64 వేల 834 మంది వేసుకోగా..రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు 84 లక్షల 22 వేల 543 మంది ఉన్నారు.
Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook