AP COVID-19 : తాజాగా 6,235 కరోనా కేసులు.. 51 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో  పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

Last Updated : Sep 21, 2020, 06:53 PM IST
AP COVID-19 : తాజాగా 6,235 కరోనా కేసులు.. 51 మంది మృతి

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. గత 24గంటల్లో ( ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు ) 56,569 శాంపిళ్లను పరీక్షించగా.. 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,31,749 కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 5,410 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Monditoka Jagan Mohan Rao: ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 74,518 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 5,51,821 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 51,60,700 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 10,502 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

AP corona bulletin

Also read: Pulasa Fish: పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత

Trending News