AP Rajyasabha Elections 2024: వైసీపీలో రాజ్యసభ టెన్షన్, అసంతృప్తుల పరిస్థితి ఏంటి

AP Rajyasabha Elections 2024: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మూడు స్థానాలకై జరగనున్న ఎన్నికల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్ధుల ప్రకటనతో మొదలైన అసంతృప్తుల బెడద ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2024, 11:49 AM IST
AP Rajyasabha Elections 2024: వైసీపీలో రాజ్యసభ టెన్షన్, అసంతృప్తుల పరిస్థితి ఏంటి

AP Rajyasabha Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజ్యసభ ఎన్నికలు సవాలుగా మారాయి. సంఖ్యాబలం పరిశీలిస్తే మూడు రాజ్యసభ స్థానాల్లో విజయం పార్టీకు నల్లేరుపై నడకే అయినా..పార్టీలో అసంతృప్తుల కారణంగా అంత సులభం కాదన్పిస్తోంది. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకై అభ్యర్ధుల్ని ప్రకటిస్తూ తరుణంలో భారీగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. టికెట్ దక్కనివారు, స్థానభ్రంశం చెందినవారు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కొందరు పార్టీని వీడారు. వాస్తవానికి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలు గెలిచేందుకు కావల్సిన సంఖ్యాబలం వైఎస్సార్ పార్టీకు పూర్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీకు ఏ మాత్రం సంఖ్యాబలం లేదు. కానీ వైసీపీ నుంచి వచ్చే అసంతృప్తులపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అందుకే సంఖ్యాబలం లేకున్నా అభ్యర్ధిని బరిలో దించుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన నుంచి వైసీపీకు మారిన 5 మంది, వైసీపీ నుంచి టీడీపీకు మారిన నలుగురు మొత్తం 9మందిపై అనర్హతపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. 

వైసీపీలో ఉన్న అసంతృప్తుల ఆధారంగా తెలుగుదేశంకు అవకాశం దక్కకుండా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల్ని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇంకా చాలా స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉన్నా రాజ్యసభ ఎన్నికల్ని పరిగణలో తీసుకుని వాయిదా వేసింది.ఇప్పటికే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన గుమ్మనూరు జయరాం, కాపు రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు, నచ్చజెప్పేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అవసరమైతే ఎమ్మెల్యేల్ని క్యాంపుకు తరలించేందుకు కూడా పార్టీ యంత్రాంగం సిద్ధమైనట్టు సమాచారం. టీడీపీ కూటమి అభ్యర్ధిని రంగంలో దించితే సింగపూర్, థాయ్‌లాండ్ పర్యటనకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. 

Also read: Ys Sharmila on Jagan: జగన్‌ను గద్దె దించుతానంటూ శపధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News