Andhra Pradesh rains: Trains cancelled, diverted due to Andhra pradesh floods : ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఇవాళ పలు రైళ్లు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వెల్లడించింది. తడ - సూళ్లూరుపేట మార్గంలో ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ఇవాల వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
త్రివేండ్రం - షాలిమర్, ముంబై సీఎస్‌టీ.. చెన్నై సెంట్రల్, తిరుపతి - హెచ్ నిజాముద్దీన్, కాచిగూడ - మంగళూరు (Kachiguda - Mangalore), బెంగళూరు - గువహటి, చెన్నై సెంట్రల్ - హెచ్ నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ - హౌర, చెన్నై సెంట్రల్ - విజయవాడ, నందలూరు - రాజంపేట మధ్య నడిచే 12 రైళ్లను (12 trains) దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఇవాల్టి తిరుపతి - చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - ముంబై సీఎస్‌టీ, గుంతకల్ - రేణిగుంట, బిట్రగుంట - చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - బిట్రగుంట రైళ్లు, విజయవాడ - చెన్నై సెంట్రల్ (Vijayawada - Chennai Central), చెన్నై సెంట్రల్ - విజయవాడ రైళ్లను రద్దు చేశారు.
Also Read :సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్..భారీ వర్షాలపై ఆరా..
నందలూరు - రాజంపేట (Nandalur - Rajampeta)మధ్య రైలు పట్టాలపై ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న వరద నీరు కారణంగా ఈ రోజు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటినీ దారిమళ్లించారు.చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్, కాచిగూడ - చెంగల్పట్టు, ఎల్టీటీ ముంబై - చెన్నై సెంట్రల్, సీఎస్‌టీ ముంబై - నాగర్ సోల్, మధురై - ఎల్‌టీటీ ముంబై, చెంగల్పట్టు - కాచిగూడ, చెన్నై సెంట్రల్ - ఎల్‌టీటీ ముంబై రైళ్లు రద్దు అయ్యాయి.
Also Read :కడప జిల్లా రాజంపేట వరదల బీభత్సం ఘటనలో ఇప్పటి వరకు 12 మృతదేహాల లభ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook