Janasena-Tdp List: కాపుల్లో కాకరేపుతున్న జనసేన-టీడీపీ పొత్తు, కేడర్‌లో అసంతృప్తి

Janasena-Tdp List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా వ్యవహారం కాపుల్లో అసంతృప్తి రాజేస్తోంది. తక్కువ సీట్లకే సర్దుబాటు జరగడంతో ఓటు బదిలీ ఇప్పుడు ప్రశ్నార్ధకమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2024, 08:40 PM IST
Janasena-Tdp List: కాపుల్లో కాకరేపుతున్న జనసేన-టీడీపీ పొత్తు, కేడర్‌లో అసంతృప్తి

Janasena-Tdp List: ఎట్టకేలకు తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు నిగ్గు తేలింది. 40-50 స్థానాలు ఆశించిన జనసేన కార్యకర్తలకు నిరాశ మిగిలింది. కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలతో జనసేన సరిపెట్టుకోవల్సి రావడం కేడర్‌లో తీవ్ర అసంతృప్తిని కల్గిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం అసహనంగా ఉన్నట్టు సమాచారం.

ఇవాళ విడుదలైన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితాలో 99 మంది అభ్యర్ధుల పేర్లున్నాయి. ఇందులో 94 తెలుగుదేశం అభ్యర్ధులవి కాగా జనసేన పార్టీవి 5 ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ పరిణామం సహజంగానే కాపు సామాజికవర్గంలో అసంతృప్తికి కారణమైంది. కాపులకు రాజ్యాధికారం దక్కాలని ఆశించిన ఆ సామాజికవర్గానికి నిరాశ ఎదురైంది. ఇన్నాళ్లూ పొత్తు అంటూ మాట్లాడిన చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ సైతం బీజేపీతో పొత్తు నేపధ్యంలో సీట్లు తగ్గించుకోవల్సివచ్చిందని చెప్పడం కాపులకు నచ్చలేదని తెలుస్తోంది. బీజేపీతో పొత్తున్నప్పుడు టీడీపీ సీట్లు తగ్గించుకోవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

మరోవైపు చంద్రబాబు మొత్తం 94 స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటిస్తే జనసేన తనకు కేటాయించిన 24లో కేవలం 5 మాత్రమే ప్రకటించడంపై కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంటే ఈ 24లో కూడా చంద్రబాబు సూచించిన జనసేన నేతలుంటారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

తెలుగుదేశం 94తో పాటు జనసేనకు కేటాయించిన 24 మినహాయిస్తే ఇంకా 57 స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇందులో జనసేన కోటా ఏం లేదు. బీజేపీకు 10-15 కేటాయిస్తే మిగిలిన సీట్లలో టీడీపీ రెండో జాబితా ఉంటుంది. తనకు కేటాయించిన 24 స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించలేకపోవడంతో పాటు తానెక్కడ్నించి పోటీ చేయనున్నారో కూడా చెప్పలేకపోవడంపై జనసేన కార్యకర్తల్లో ఆవేదన కన్పిస్తోంది. ఏదేమైనా ఇవాళ్టి జాబితా ఊహించని పరిణామమంటున్నారు. 

Also read: DA Hike: మార్చ్ నుంచే ఉద్యోగుల డీఏ పెంపు, భారీగా పెరగనున్న కనీస వేతనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News