హమ్మయ్య..!! ఆ తెలుగువారు క్షేమం..

కరోనా వైరస్ ప్రపంచాన్ని  గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి. 

Last Updated : Feb 19, 2020, 10:59 AM IST
హమ్మయ్య..!! ఆ తెలుగువారు క్షేమం..

కరోనా వైరస్ ప్రపంచాన్ని  గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలుగు వారిపైనా అనుమానపు నీడలు నెలకొన్నాయి. 

చైనాలోని వుహాన్ నంచి దాదాపు 15 రోజుల క్రితం రెండు దఫాలుగా రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. వారిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకు వచ్చిన తర్వాత .. అక్కడి నుంచి నేరుగా ఐటీబీపీ ఆస్పత్రికి తరలించారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రక్త నమూనాలకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన తర్వాత కూడా వారిని మళ్లీ  మళ్లీ పరీక్షించారు. మొత్తంగా వారికి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాత.. తిరిగి స్వస్థలాలకు పంపిస్తున్నారు. వారిలో 35 మంది తెలుగు  వారు కూడా ఉన్నారు. 

 

35 మంది తెలుగు వారు. .  అంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం విశేషం. వారు ఈ రోజు ఢిల్లీ నుంచి విశాఖపట్నంలోని  విమానాశ్రయానికి చేరుకున్నారు. చైనా నుంచి వచ్చిన తర్వాత 20 రోజులకు వారు స్వంత గడ్డపై అడుగు పెట్టారు. ఐతే చైనాలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని.. వాటిని తలచుకుంటేనే భయం వేస్తోందని తెలుగు వారు చెప్పడం విశేషం. మొత్తంగా స్వదేశానికి ప్రాణాలతో  తిరిగి వచ్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

Trending News