Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వంలోని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మధ్య ఈ విషయపై చర్చలు పూర్తయ్యాయి.
ఏపీలోని అధికార పార్టీ నేతలకు శుభవార్త. త్వరలో ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. నామినేటెడ్ పదవుల జాబితాను చంద్రబాబు సిద్ధం చేయగా పార్టీల నుంచి ఆశావాహుల జాబితాను బీజేపీ , జనసేన పార్టీలు చంద్రబాబుకు అందించాయి. త్వరలోనే ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా పదవుల పందేరం జరగనుంది. ఈసారి జాబితా పెద్దదే ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పదవులు ఆశించవారి సంఖ్య భారీగా ఉంది. అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ పదవి దక్కని ఆశావహుల్నించి ఇతర కార్యకర్తలంతా పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు కేటాయించే పరిస్థితి లేనివారికి నామినేటెడ్ పదవులిచ్చేందుకు రంగం సిద్ధమైంది. కూటమి పార్టీల కోసం అంటే జనసేన, బీజేపీ కోసం తెలుగుదేశం పార్టీలో సీట్లు త్యాగం చేసినవారికి నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత లభించనుంది. వీరిలో పిఠాపురం వర్మ, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 60 కార్పొరేషన్ల పదవులకై పోటీ ఎక్కువగా కన్పిస్తోంది. వీటిలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్‌క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లతో పాటు కుల సంఘాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి పదవులు ఆశిస్తున్నవారిలో గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగునమ్మ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పేర్లు విన్పిస్తున్నాయి. ఇక జనసేన నుంచి అమ్మిరెడ్డి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. బీజేపీ నుంచి అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి పేర్లు విన్పిస్తున్నాయి. కూటమి పార్టీల కోసం సీట్లు త్యాగం చేసిన బడా నేతలకు మాత్రం ఎమ్మెల్సీ పదవులు వరించవచ్చు.
Also read: IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.