AP Schools : ఏపీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేయాలని చూస్తోందంటోన్నారు పీడీఎఫ్ ఎమ్మల్సీలు. ఆంధ్రప్రదేశ్‌లోని 35,000 స్కూళ్లను (Schools) మూసివేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. నూతన విద్యావిధానంపై (New Education System) ఏపీ ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్ సాబ్జి, రఘువర్మ బహిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల దగ్గరకు బడి అని కాకుండా, బడి దగ్గరకు పిల్లలు అనే విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కేవలం ఎకానమీ కోసమే స్కూళ్ల మెర్జింగ్‌ను ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు. నూతన జాతీయ విద్య విధానంలో లేనివి కూడా ఏపీలో అమలు చేస్తున్నారన్నారు. ఇందుకు వ్యతిరేకంగా అసెంబ్లీతో పాటు బయట కూడా పోరాటం చేస్తామని వారు ప్రకటించారు.
Also Read: Budget 2022: ఇప్పటివరకూ అత్యధిక సమయం పాటు బడ్జెట్ స్పీచ్ ఇచ్చినదెవరో తెలుసా..
అలాగే నాడు.. నేడు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ వారు ఆరోపించారు. ఏపీలో కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ తరహా విద్యను ప్రోత్సహించాలంటూ వారు కోరారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతోనే... నూతన విద్యావిధానంపై ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించామని ఎమ్మెల్సీలు తెలిపారు.
Also Read: Drugs case: హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు కలకలకం- వెలుగులోకి వ్యాపారుల పేర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook