రేపటి నుంచి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

పాఠశాలల వరకే పరిమితమైన 'మధ్యాహ్న భోజన' పథకం జూనియర్ కళాశాలల వరకు పోడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Last Updated : Jul 2, 2018, 03:51 PM IST
రేపటి నుంచి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

పాఠశాలల వరకే పరిమితమైన 'మధ్యాహ్న భోజనం' పథకం జూనియర్ కళాశాలల వరకు పోడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూలై 2 నుంచి ‘మధ్యాహ్న భోజన’ పథకం అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలోని 447 ప్రభుత్వ, 150 ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. అటు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేసినట్లు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నెల క్రితమే ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా.. ఇంటర్ బోర్డు.. రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు నివేదికలు అందజేయాలని కోరింది. వారి వద్ద నుండి సమగ్ర నివేదికలు రాగానే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.23 కోట్లు కేటాయించిందని సమాచారం.

Trending News