ఏపీ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ఇదే

ఏపీ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్

Last Updated : Nov 14, 2018, 09:43 PM IST
ఏపీ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ఇదే

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు మొత్తం 10.25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయని మంత్రి స్పష్టంచేశారు. జనవరి 28న హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌, 30న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్‌ జరగనుండగా ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. 

Trending News