Grama Sabha: దేశచరిత్రలో నిలిచిపోయేలా.. 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

Deputy CM Pawan Kalyan: దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఒకే రోజు 13,326 పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రణాళికలు రూపొందించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 23, 2024, 06:44 AM IST
Grama Sabha: దేశచరిత్రలో నిలిచిపోయేలా.. 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

Deputy CM Pawan Kalyan: ఊరు బాగు కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ప్రణాళికలు రూపొందించారు. ఊరు బాగు ప్రతి ఒక్కరు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు. గ్రామ సభలకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి పూర్తిగా వివరించారు. అందుకు తగిన విధంగా గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. 

Also Read: Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే  

ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్‌ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామన్నారు. 

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పవన్ కళ్యాణ్ తన మార్క్‌ చూపిస్తున్నారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత 30 ఏళ్లుగా పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తున్నారు. ఈ విషయం తెలుచుకున్న పవన్.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక నుంచి మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచాలని స్పష్టం చేశారు. 

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న డిప్యూటీ సీఎం.. ఇప్పుడు మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందామంటూ పంచాయతీ సంస్కరణలు చేపట్టారు. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా.. పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తామన్నారు. పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి ఆయన కోరారు.

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News