AP Elections 2024: ఈసీ మరిన్ని ఆంక్షలు, ఇంటింటి ప్రచారానికీ అనుమతి

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అంతా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే నడుస్తోంది. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆంక్షలు రాజకీయ పార్టీలకు ఇరుకునపెట్టనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2024, 11:07 AM IST
AP Elections 2024: ఈసీ మరిన్ని ఆంక్షలు, ఇంటింటి ప్రచారానికీ అనుమతి

AP Elections 2024: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఏపీలో నాలుగో విడతలో జరిగే ఎన్నికలకు పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తవడంతో ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. 

ఏపీలో ఎన్నికల కోడ్ మరింత కఠినమైంది. రాజకీయ పార్టీల నేతలకు మరిన్ని ఆంక్షలు వచ్చి చేరాయి. ఎన్నికల సంఘం కన్నుసన్నల్లోనే మొత్తం ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా జారీ చేసిన ఆదేశాలను ఎక్కడ ఎప్పుడు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఇప్పటి వరకైతే రాత్రి 10 గంటల తరువాత మైక్ బంద్ చేయడం, మైకు అనుమతి, సభలు, సమావేశాలకు అనుమతి, ఖర్చు వివరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఆంక్షలు వచ్చి చేరాయి. ఇక నుంచి రాజకీయ పార్టీలు లేదా అభ్యర్ధుల ఇంటింటి ప్రచారానికి ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. స్థానికంగా ఉన్న రిటర్నింగ్ అధికారుల అనుమతితో ఓటర్ల ఇళ్లకు వెళ్లాల్సి ఉంంటుంది. ఇక సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీకు సువిధ యాప్‌లో అనుమతి పొందాల్సి ఉంటుంది. 

ఇక స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్య నేతలు ప్రచార వాహనాల అనుమతి మాత్రం సీఈవో స్థాయిలోనే తీసుకోవల్సి ఉంటుంది. ప్రచార సామగ్రి అనుమతి కూడా సీఈవో నుంచే తీసుకోవాలి. జిల్లా స్థాయిలో సభలు, సమావేశాలకు మాత్రం జిల్లా స్థాయి రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. రాష్ట్రంలో సభలు, సమావేశాలకు 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలి. ఇక పోలింగ్‌కు 48 గంటల ముందైతే ఎలాంటి అనుమతులు మంజూరు చేయమని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. పోలింగ్ రోజు విధి విధానాలు కూడా ఎన్నికల సంఘం జారీ చేసింది. అసెంబ్లీ అభ్యర్ధితో పాటు పోలింగ్ ఏజెంట్‌కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే నియోజకవర్గంలో తిరిగేందుకు అనుమతి ఉంటుంది. 

Also read: Janasena Candidates List: జనసేన జాబితాలో బీసీలకు మొండిచేయి, కాపులకే అందలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News