/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి 2014 రిపీట్ కానుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపైనే స్పష్టత రావల్సి ఉంది. 

ఏపీలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతున్నాయి. ఇదే కూటమిలో బీజేపీను చేర్చుకుని 2014 రిపీట్ చేయాలనేది ఆలోచనగా ఉంది. జనసేనకు 25 అసెంబ్లీ, 2-3 పార్లమెంట్ స్థానాలు దక్కవచ్చు. బీజేపీతో పొత్తు విషయమై ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు చర్చలు జరిపారు. అటు బీజేపీ అగ్ర నాయకత్వం సైతం ఏపీలో తెలుగుదేశం-జనసేనతో పొత్తు ఉంటుందనే సంకేతాలిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటుపై అంగీకారం కుదిరితేనే పొత్తు ఉంటుందా లేదా అనేది అధికారికంగా ప్రకటన వెలువడవచ్చు. చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల్ని కలవాల్సి ఉంది. కానీ ఈ పర్యటనకు బ్రేక్ పడింది. 

ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. జనసేన మాత్రం పొత్తులో భాగంగా 40 అసెంబ్లీ స్థానాలు కోరుతోంది. అటు పొత్తు కుదిరితే బీజేపీ 20 అసెంబ్లీ 5-6  పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్నట్టు సమాచారం. బీజేపీ పెద్దల్నించి ఇదే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ మాత్రం జనసేన-బీజేపీలకు కలిపి 40 అసెంబ్లీ, 8-9 పార్లమెంట్ స్థానాలిచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 

ఒకవేళ బీజేపీ, జనసేనలు కోరినట్టుగా సీట్లు ఇచ్చేదైతే తెలుగుదేశం 50-60 అసెంబ్లీ 10 పార్లమెంట్ స్థానాలకు కోల్పోవల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంకు మిగిలేది కేవలం 15 పార్లమెంట్, 110-125 అసెంబ్లీ సీట్లు మిగులుతాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతల్నించి వ్యతిరేకత రావచ్చు. 

Also read: Qatar government: ఆ 8 మందికి క్షమాభిక్ష, విడుదల చేసిన ఖతార్ దేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Andhra pradesh Elections 2024 telugudesam-janasena-bjp like to contest as alliance chek here hom many seats will be allocated to each party rh
News Source: 
Home Title: 

AP Elections 2024: పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు

AP Elections 2024: పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు
Caption: 
Telugudesam-janasena-bjp ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Elections 2024: పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, February 12, 2024 - 08:55
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
64
Is Breaking News: 
No
Word Count: 
250