AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత

AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వార్ వన్‌సైడ్ అని కూటమి నిరూపించింది. అధికార పార్టీ ఘోర ఓటమి మూటగట్టుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2024, 07:43 AM IST
AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత

AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని క్లీన్‌స్వీప్ చేసింది. 

ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాదని భారీ విజయాన్ని దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కాగా తెలుగుదేశం పార్టీ 136 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సహా అందరూ భారీ మెజార్టీతో విజయం సాధించినవాళ్లే. తెలుగుదేశం తరువాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా జనసేన నిలిచింది. పోలవరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఐదంకెల మెజార్టీ నమోదు చేసింది పార్టీ. ఈ సందర్భంగా జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు, సాధించిన మెజార్టీ వివరాలు తెలుసుకుందాం.

జనసేన గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధులు, మెజార్టీ వివరాలు

పిఠాపురం                  కొణిదెల పవన్ కళ్యాణ్                     70.279 ఓట్ల మెజార్టీ
తెనాలి                       నాదెండ్ల మనోహర్                          48,112 ఓట్ల మెజార్టీ
అవనిగడ్డ                  మండలి బుద్ధప్రసాద్                       46,434 ఓట్ల మెజార్టీ
అనకాపల్లి                  కొణతాల రామకృష్ణ                          65,764 ఓట్ల మెజార్టీ
కాకినాడ రూరల్        పంతం నానాజీ                                 72,040 ఓట్ల మెజార్టీ
నిడదవోలు               కందుల దుర్గేష్                                33,304 ఓట్ల మెజార్టీ
పాలకొండ                 నిమ్మక జయకృష్ణ                            13,291 ఓట్ల మెజార్టీ
నెల్లిమర్ల                    లోకం మాధవి                                  39,829 ఓట్ల మెజార్టీ
విశాఖపట్నం సౌత్    వంశీకృష్ణ శ్రీనివాస్                           64,594 ఓట్ల మెజార్టీ
పెందుర్తి                    పంచకర్ల రమేశ్ బాబు                      81,870 ఓట్ల మెజార్టీ
ఎలమంచిలి             సుందరపు విజయ్ కుమార్               48,956 ఓట్ల మెజార్టీ
రాజోలు                     దేవ వరప్రసాద్                                39,011 ఓట్ల మెజార్టీ
పి గన్నవరం              గిడ్డి సత్యనారాయణ                        33,367 ఓట్ల మెజార్టీ
రాజానగరం               బత్తుల బలరామకృష్ణ                      34,049 ఓట్ల మెజార్టీ
నరసాపురం               బొమ్మిడి నారాయణ నాయకర్          49,738 ఓట్ల మెజార్టీ
భీమవరం                  పులపర్తి రామాంజనేయులు             66,974 ఓట్ల మెజార్టీ
తాడేపల్లిగూడెం         బొలిశెట్టి శ్రీనివాస్                             62,492 ఓట్ల మెజార్టీ
ఉంగుటూరు              పత్సమట్ల ధర్మరాజు                        44,945 ఓట్ల మెజార్టీ
తిరుపతి                    అరణి శ్రీనివాసులు                          61,956 ఓట్ల మెజార్టీ
కోడూరు                     అరవ శ్రీధర్                                     11,101 ఓట్ల మెజార్టీ
పోలవరం                  చిర్రి బాలరాజు                                   7,935 ఓట్ల మెజార్టీ

Also read: AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులు, మెజార్టీ ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News