AP: ఏపీలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

కరోనా వైరస్ సంక్రమణపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ సాధించినట్టే కన్పిస్తోంది. నెలరోజుల్నించి రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది.

Last Updated : Nov 4, 2020, 06:56 PM IST
AP: ఏపీలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ సాధించినట్టే కన్పిస్తోంది. నెలరోజుల్నించి రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశంలో ఎక్కడా చేయనివిధంగా భారీగా కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests ) చేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ ఇదే అవలంభిస్తోంది. రోజుకు 70-80 వేల నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. 

అక్టోబర్ నెలకు ముందు వరకూ రోజుకు 10-11 వేల కేసులు నమోదవుతుండేవి. క్రమంగా ఇందులో మార్పు వచ్చింది. కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పిస్తూ వచ్చింది. గత కొద్దిరోజులుగా అయితే రోజుకు కేవలం 2 వేల  5 వందల వరకే కేసులు బయటపడుతున్న పరిస్థితి. గత 24 గంటల్లో 74 వేల 465 పరీక్షలు నిర్వహించగా...కేవలం 2 వేల 477 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 8 లక్షల 33 వేల 208కు చేరుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 21 వేల 438 మాత్రమే.  అంటే ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్. 8 లక్షల 5 వేల 26గా ఉంది.  గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 10 మంది మరణించగా..ఇప్పటివరకూ 6 వేల 744 మంది మృతి చెందారు. Also read: AP: విజయవాడ, విశాఖలో త్వరలో సీ ప్లేన్ సౌకర్యం

Trending News