AP Budget: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. పద్దులో ఏ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావన లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇదే విషయమై కేంద్ర బడ్జెట్ విషయంలో సీఎం జగన్ విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు సోము వీర్రాజు.
కేంద్ర బడ్జెట్‌ను తప్పుబట్టిన జగన్ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఎందుకు ప్రాంతాల ప్రస్తావన తేలదని విమర్శలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం మసి పూసి మారెడు కాయ అన్న చందాన ఉందని చెప్పారు. ఈ బడ్జెట్‌ను చూస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోందన్నారు.
అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సోము వీర్రాజు. ఇప్పటికే రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లకు చేరిందనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. ఈ అప్పులు ఎగ్గొట్టేందుకే ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తరు చేస్తోందని ఆరోపణలు చేశారు.
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. రాష్ట్ర అప్పులు ఎన్ని అనే విషయంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు సోము వీర్రాడు. ఈ విషయంపై ఎన్ని సార్లు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు.
Also read: AP Cabinet Expansion: సస్పెన్స్‌కు తెర.. కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన సీఎం జగన్...
Also read: Food Poisoning in School: మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులకు అస్వస్థత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook