Ambedkar Jayanthi Spl: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Ambedkar Jayanthi Spl: స్వతంత్య్ర భారతవనిలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అణగారిన కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ఊరూరా విగ్రహమై నిలిచారు. అలాంటి మహాభావుడికి తెలుగు నేలతో మంచి అనుబంధమే ఉంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 10:50 AM IST
Ambedkar Jayanthi Spl: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Ambedkar Jayanthi Spl: అంబేద్కర్ అంటే ఒక పేరు కాదు. ఒక సమూహ శక్తి. నాడు నేడు ఏనాడు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు ..ఒక సామూహిక శక్తి. అంటరానితనంలో మగ్గిపోయిన బహుజనుల సంగ్రామ భేరి. దేశాన్ని ఎటువైపు నడపాలో చూసిన రాజ్యాంగ దీప స్తంభం. భరత మాత కన్న అనర్ఘ భారతరత్నం అంబేద్కర్. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మ గాంధీ పోరాటం చేస్తే.. ఆ తర్వాత భిన్న కుల ,మత  ప్రాంత వైరుధ్యాల నడుమ అందరికి ఆమోద యోగ్యంగా రాజ్యాంగం అనే ఒక్కతాటి మీద నడిపిన మహానీయుడు. ఈయనకు తెలుగు నేలకు మంచి అనుబంధమే ఉంది. ఆయన కన్నుమూసి ఆరు దశాబ్దాలైననా అంబేద్కర్ భావజాలం మరింత పెరిగిందే కానీ ఎక్కడ తగ్గలేదు దటీజ్ అంబేద్కర్. అపర మేధావి అయిన అంబేద్కర్ మన దేశం కోసం ఎన్నో దేశాల రాజ్యాంగాలను ఔపోసన పట్టి.. మన దేశానికి అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబా సాహెబ్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్. అంతేకాదు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలో విరవిస్తూ అనేక జాగ్రత్తలు ఎప్పారు.

అంబేద్కర్‌కు హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలతో మంచి అనుబంధమే ఉంది. అంతేకాదు హైదరాబాద్ తరచూ వచ్చేవారు. హైదరాబాద్ విద్యా సాంస్కృతిక కేంద్రమని భావించేవారు. ఇక్కడ ఎపుడు ఎలాంటి చర్చలున్న ఇక్కడకు వచ్చేవారు. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర తర్వాత ఆయనకు ఎక్కుమ మంది అభిమాన గణం ఉన్నది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే అని చెప్పాలి. అప్పటి హైదరాబాద్ సంస్థాన పాలకులతో అంబేద్కర్‌కు మంచి సంబంధాలే ఉండేవి. 1931-32 మధ్య ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనకు నిజాం నుంచి ఆర్ధిక సాయం అందుకున్నారు. నిజాం ఫైనాన్షియల్ మినిస్టర్ నుంచి రూ. 15 వేల సాయం ఒకేసారి ఇవ్వడమే కాదు.. నెలకు రూ. 500 చొప్పున మూడేళ్ల పాటు ఇచ్చేలా చేయడంలో నిజాంను ఒప్పించారు.

 హైదరాబాద్‌ సంస్థాన పాలకులతో కూడా మంచి సంబంధాలుండేవి. 1931-32 ప్రాంతంలో కాంగ్రెస్‌ నుంచి క్లిష్ట ప్రతిఘటనను ఎదుర్కొంటున్న సమయంలో ఆయనకు నిజాం నుంచి ఆర్థిక సాయం అందింది. నిజాం ఆర్థిక శాఖ రూ.15 వేల సాయం ఏకమొత్తంగా ఇవ్వడమే కాకుండా నెలకు రూ.500 చొప్పున మూడేళ్లు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు అందించారు.

అంబేద్కర్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే ఆదరణ దక్కింది. అంబేద్కర్ బహుజనుల కోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉండాలని భావించారు. 1952 జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో అంబేద్కర్ పార్టీ దేశ వ్యాప్తంగా 34 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్ల గెలిచింది. అందులో మహారాష్ట్రలోని షోలాపూర్ అయితే.. రెండోది తెలంగాణలోని కరీంనగర్ స్థానం కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పన్నిన కొన్ని కుయుక్తల వల్ల అంబేద్కర్ ఓడిపోయారు. ఇక కరీంనగర్ నుంచి ఎం.ఆర్.కృష్ణ గెలుపొందారు.

వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో 215 స్థానాల్లో పోటీ చేస్తే.. 12 మంది విజయం సాధించారు. హైదారాబాద్ నుంచి 5, మద్రాసు ప్రావిన్సు నుంచి రెండు గెలిచారు. అవి రెండు కూడా ఆంధ్రా ప్రాంతాలు కావడం విశేషం. హైదరాబాద్ శాసనసభకు గెలిచిన వాళ్లలో సిరిసిల్ల నుంచి జె.ఎం.రాజమణి దేవి, మహబూబా బాద్ నుంచి BR చందర్ రావు, జగిత్యాల నుంచి బుట్టి రాజారామ్ ఉన్నారు.

ఆంధ్రా ప్రాంతం నుంచి గెలిచిన వారిలో అమలాపురం నుంచి బొజ్జా అప్పలస్వామి ఒకరు. అంతేకాదు హైదరాబాద్ నుంచి జే.హెచ్. సుబ్బయ్య  ఆ పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికవ్వడం విశేషం. ఆ తర్వాత అంబేద్కర్ ఆ పార్టీనీ మూసేసారు. అంతేకాదు ఇతర అణగారిన వర్గాల కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు.

Also Read: Harish Rao: చీము నెత్తురు ఉన్నోళ్లు ఎవరూ కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేయరు: హరీశ్ రావు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News