Ambati Rambabu Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని చంపే అవసరం వారికే ఉంది.. అంబటి రాంబాబు

Ambati Rambabu Comments on Pawan Kalyan: మరో 9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కోబోతున్నామో తమకు సరైన స్పష్టత ఉంది అని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో పాటు దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నాము. జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : Jun 22, 2023, 10:02 AM IST
Ambati Rambabu Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని చంపే అవసరం వారికే ఉంది.. అంబటి రాంబాబు

Ambati Rambabu Comments on Pawan Kalyan: ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎందుకు తిరగబడాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి అని తాను అడుగుతున్నాను అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రేపు జరిగే ఎన్నికలు.. పేదలకు పెద్దలకు మధ్య జరిగే కురుక్షేత్ర సంగ్రామం లాంటివి. ఈ ఎన్నికల్లో కౌరవులు ఓడిపోబోతున్నారు. మేము పేదల పక్షమైన తమ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుంది.. అదే సమయంలో పెత్తందారులు ఓడిపోబోతున్నారు అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 

ఏపీలో కాపులకు కష్టం వచ్చినపుడు అండగా నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభంకు మాకు, మా పార్టీకి మధ్య విభేధాలు ఉన్నాయి. రంగ హత్య అనంతరం తెలుగు దేశం పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చేశారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాస్తో కూస్తో ముద్రగడ పద్మనాభంకే ఉంటుంది కానీ కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, ఆ తరువాత గాలికి వదిలేసే కుట్ర పూరిత రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కి లేదు అని అన్నారు.

పవన్ కళ్యాణ్ గ్రాఫ్, ఇమేజ్ రోజు రోజుకూ పడిపోతోంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే స్థితికే వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా పవన్ కళ్యాణ్ కి స్పష్టత లేదు కానీ.. తనను సీఎం చేయాలని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తూ తనని సీఎం చేయమని అడగడంలో అర్థం లేదు అని పవన్ కళ్యాణ్ కి చురకలంటించారు.  

తాను సీఎం కాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడే.. అప్పటి వరకు ఆయన వెంట నడిచిన కాపులు కూడా జనసేన పార్టీ జెండాను కింద పడేసి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా ఉంది. ప్రాణ భయం ఉందంటోన్న పవన్ కళ్యాణ్ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రాష్ట్ర రాజకీయాల్లో పనికి రాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ నిలబడ్డ చోట డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది అని ఎద్దేవా చేశారు. 

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 సీట్లు తమ పార్టీనే గెలుచుకోబోతున్నాం. వారాహి అంటే దశవతారాల్లో అమ్మవారి అవతారం లేదా పంది అని అర్థం వస్తుంది. వాహనానికి వారాహి అని పేరు పెట్టి పవన్ అపచారం చేశారు. పవన్ ఎక్కింది వారాహి కాదు... పందిపై ఎక్కారు. పవన్ కళ్యాణ్ పందిపై ఎక్కి తిరుగుతున్నారు. కాపుల్ని బీసీల్లో చేర్చుతామని 2004 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడిది అని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి : Pawan vs Chintamaneni: నాడు నువ్వెంతంటే నువ్వెంత...ఇప్పుడేమో సీటు త్యాగం చేస్తానంటూ బంపరాఫర్

అప్పట్లో పవన్ కళ్యాణ్ తెదేపా ప్రభుత్వానికి మద్దతిచ్చి ఏం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి నివేదిక పంపించారు అని చెబుతున్నారు కదా.. మరి పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని అదే కేంద్రాన్ని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి. అలా చేయగలరా అని నిలదీశారు. తనకు ప్రాణ హానీ ఉందని ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు అని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా చంపాల్సి వస్తే.. అది అప్పట్లో రంగాను చంపిన బ్యాచే ఆ పని చేస్తుంది అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి : Pawan Kalyan News: మీకు రూ. 10 లక్షలు ఆర్ధిక సాయం అందించే పూచీ నాదీ.. పవన్ కళ్యాణ్ వరాల జల్లు

ఇది కూడా చదవండి : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News