CM JaganDavos: దావోస్ లో దుమ్ము రేపుతున్న జగన్.. ఆంధ్రాలో అదానీ రూ.60 వేల కోట్ల పెట్టుబడి

CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 08:55 AM IST
  • దావోస్ లో ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు
  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.60 వేల కోట్ల పెట్టుబడి
  • 3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు
  • 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు
CM JaganDavos: దావోస్ లో దుమ్ము రేపుతున్న జగన్.. ఆంధ్రాలో అదానీ రూ.60 వేల కోట్ల పెట్టుబడి

CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. ఏపీలో 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. ఆదివారం అదాని గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీతో సమావేశమైన సీఎం జగన్.. సోమవారం మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వానికి డీల్ కుదిరింది.  

ఆంధ్రప్రదేశ్ లో 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు కాలుష్య రహిత విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పాలని అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ నిర్ణయించింది. ఇందులో 3,700 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు ఒకటి కాగా.. మరొకటి 10,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం.. అదానీ గ్రూప్ సంస్థల మధ్య దావోస్ వేదికగా అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం జగన్, గౌతమి అదానీ సమక్షంలో ఏపీ ప్రభుత్వ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి ఆశిష్‌ రాజవంశీ డీల్ పై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు మెగా ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అదానీ సంస్థ ప్రకటించింది.

 

ఇక దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నానితో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో సింగిల్‌ విండోలో అనుమతులు ఉన్నాయని చెప్పారు. విశాఖను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో  ఉన్నారని ఈ సందర్భంగా గుర్నాని చెప్పారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ పై హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో వర్సిటీతో కలిసి పనిచేస్తామన్నారు. ఆంధ్రా వర్సిటీతో కలిసి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందిస్తామన్నారు టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నాని. టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ అసాగో కూడా 250 కోట్ల రూపాయలతో ఏపీలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.

READ ALSO: MLC Anantha Babu: డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటీ! 20 వేల కోసం ఎమ్మెల్సీ చంపేస్తాడా?

READ ALSO: CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News