Actress Samantha: కడపలో సమంత సందడి...భారీగా తరలివచ్చిన జనం

Samantha: టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత ఆదివారం కడపలో సందడి చేశారు. నగరంలో షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం కడప దర్గాను దర్శించుకున్నారు సమంత.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 07:00 PM IST
Actress Samantha: కడపలో సమంత సందడి...భారీగా తరలివచ్చిన జనం

Samantha visits kadapa: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత(samantha) ఆదివారం కడప(Kadapa)లో సందడి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్‌(Mangalya Shopping Mall)ను ఆమె ప్రారంభించారు. మెుదటి మాంగల్య షాపింగ్ మాల్‌ను తెలంగాణలో తానే ప్రారంభించానని...ఇప్పుడు 11వ షాపింగ్ మాల్‌ను కడపలో ప్రారంభించడం సంతోషంగా ఉందని సమంత అన్నారు. కడపకు రావడం చాలా సంతోషంగా ఉందని, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘స్వామీ నదికి వెళ్లలేదా’ అనే డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు సమంత.

Also Read: Harbhajan Singh: ఛాతిపై టాటూ వేసుకుని...రజనీకి బర్త్ డే విషెస్ చెప్పిన టీమిండియా క్రికెటర్

సమంత కడపకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు..షాపింగ్ మాల్ వద్దకు రెండు గంటలు ముందుగానే చేరుకున్నారు. సమంత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మాంగల్య షాపింగ్ మాల్ కడపలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఛైర్మన్ ఓం నమ శివాయ తెలిపారు. అనంతరం కడపలోని పెద్ద దర్గా(Kadapa Dargha)ను సమంత దర్శించి... చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా సమంతతో దర్గా పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

విడాకుల అనంతరం సమంతా (Samantha) కెరీర్ పరంగా బిజీగా మారిపోయారు. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ హాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. ఇటీవల పుష్ప సినిమా(Pushpa Movie)లో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News