AP హెకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌

భూ సేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని, గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు తాము ఇచ్చిన భూములకు న్యాయంగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.

Last Updated : Sep 29, 2020, 01:58 PM IST
AP హెకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌

తమకు న్యాయం చేయాలని కోరూతూ టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Actor Krishnam Raju) దంపతులు, సినీ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt)‌లు వేర్వేరు కేసులలో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలోని తన భూములను, నిర్మాణాలను, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తోందని కృష్ణంరాజు దంపతులు ఆరోపిస్తున్నారు. 

ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఈ పిటిషన్ విచారించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ఏపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. 

తాను సైతం విమానాశ్రయ విస్తరణ నేపథ్యంలో 39 ఎకరాలు భూమిని ఇచ్చినట్లు నిర్మాత చలసాని అశ్వనీదత్ తెలిపారు. అందుకుగానూ భూ సేకరణ చట్టం ప్రకారం రూ.210 కోట్లు తనకు చెల్లించేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న భూమి విలువకుగానూ తనకు పరిహారంగా నాలుగు రెట్లు చెల్లించేలా చూడాలని నిర్మాత అశ్వనీదత్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News