కరోనాని జయించిన తెలుగు యువకుడు.. ఏం సలహా ఇచ్చాడంటే!

విదేశాల నుంచి వచ్చిన తాను బయట ఎక్కడా తిరగలేదని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించి చికిత్స తీసుకున్నందుకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు వివరించాడు

Last Updated : Apr 3, 2020, 01:20 PM IST
కరోనాని జయించిన తెలుగు యువకుడు.. ఏం సలహా ఇచ్చాడంటే!

కాకినాడ: తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కలవరపెడుతుండగా ఓ శుభవార్త. లండన్ నుంచి వచ్చిన ఓ తెలుగు కుర్రాడు కరోనాను జయించాడు. మీరు తనలాగే లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరితో కరోనాను ఎవరైనా జయించవచ్చునని చెబుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన 22 ఏళ్ల  యువకుడికి రెండు వారాల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి విషయం చెప్పానన్నాడు.  షాకింగ్.. నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్న తబ్లిగీ జమాత్ సభ్యులు

మెడికల్ సిబ్బంది ఆ యువకుడ్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 రోజులు చికిత్స అనంతరం తనకు కరోనా నెగటివ్ గా నిర్థారణ అయినట్లు తెలిపాడు. కరోనాను జయించడంతో తనని వైద్యులు డిశ్ఛార్జి చేసినట్లు చెప్పాడు. కరోనాను జయించిన యువకుడిని జిల్లా  కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీం ఆస్మీ, ప్రజాప్రతినిధులు అభినందించారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి వైద్య సేవలు అందించి వైరస్ బారి నుంచి సురక్షితంగా కాపాడిన వైద్యులను అధికారులు అభినందించారు.  పీఎఫ్ క్లెయిమ్ చేశారా.. స్టేటస్ ఇలా తెలుసుకోండి

జాగ్రత్తలు పాటిస్తే కరోనా ఏం చేయలేదు...
 కరోనా రక్కసి నుంచి తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు, అధికారులకు తెలిపాడు. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత సకాలంలో ఆసుపత్రికి వస్తే కరోనాను జయించవచ్చు అన్నాడు. తనకు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తరించి చికిత్స అందించారని, వారం రోజుల తర్వాత తన పరిస్థితి మెరుగైందని పూర్తిగా కోలుకునేందుకు రెండు వారాలు పట్టిందన్నాడు.   సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ 

కరోనా లక్షణాలు కనిపించినా విషయాన్ని దాచడం మనతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందన్నాడు. మార్చి 22న తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తన కుటుంబసభ్యులకు టెస్టులు చేయగా కోవిడ్ నెగటివ్‌గా తేలినట్లు చెప్పాడు. తాను బయట ఎక్కడా తిరగకుండా సకాలంటే చికిత్స తీసుకున్నందుకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు వివరించాడు. కరోనా పాజిటివ్‌గా తేలిన  యువకుడు కోలుకోవటంతో  జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News