China Pegion: ఆంధ్రప్రదేశ్‌లో చైనా పావురం కలకలం రేపుతోంది. కాలికి ఓ ప్రత్యేకమైన ట్యాగ్‌తో ఎగురుతున్న పావురంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా టు చీమకుర్తి. ఓ పావురం (China Pegion) కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ మేడపై ఎగురుతున్న పావురం ఆ ఊర్లో కలకలం రేపింది. ఆ పావురానికి ఓ ప్రత్యేకమైన ట్యాగ్ కట్టి ఉండటంతో స్థానికంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ట్యాగ్ విభిన్నంగా ఉండటంతో చైనా దేశం నుంచి వచ్చిందనే అనుమానాలు, పుకార్లు వ్యాపించాయి. స్థానికులు ఆ పావురాన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ శాఖ రంగంలో దిగి ఆ పావురాన్ని స్వాధీనం చేసుకుంది. గతంలో ఇలాగే ఒడిశాలో ట్యాగ్ కట్టి ఉన్న పావురం (Pegion) హల్‌చల్ చేయడం, అప్పుడు కూడా చైనా పావురంగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు ఆందోళన ఎక్కువైంది. ఆ ట్యాగ్ ఏంటనేదానిపై అటవీశాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. అడవిలో జంతువులు తప్పిపోకుండా ఉండేందుకు లేదా గుర్తించేందుకు కూడా ఓ రకమైన ట్యాగ్‌లు కడుతుంటారు. పావురాల్ని పెంచేవారు కూడా ట్యాగ్‌లు కడుతుంటారు. అదే తరహా అయుంటుందని..చైనా పావురం కాదని పోలీసులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయపడుతున్నారు. సమాచార సేకరణ లేదా ఏజెంట్లకు సందేశాలు పంపించేందుకు చైనా ఈ తరహా ట్యాగ్‌లు కట్టి పావురాల్ని పంపించిందనే వాదన కూడా విన్పిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: Perni Nani Vs RGV: RGV Vs AP Govt: ప్రశ్నలతో మంత్రి మతి పోగొడుతున్న వర్మ.. శృతి మించుతోందా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి