Telugu desam party: ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగు దేశం నేతలు , కార్యకర్తలు తెగ సంబరాలు చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని తమ ప్రభుత్వం రావడంతో మాకు ఎనలేని సంతోషం ఉందంటూ క్యాడర్ సంతోషంతో ఉంది. ఆలాంటి క్యాడర్ కు ఇప్పుడు కొంత అసంతృప్తి మొదలవుతుందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకప్పటి లాగా తమ అధినేత తీరు లేదని నేతలు, కార్యకర్తలు బాధపడిపోతున్నారు.చంద్రబాబు గతంలో మాదిరగా లేరని సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు చంద్రబాబు పార్టీ నేతలతో క్రమం తప్పకుండా సమావేశం అయ్యే వారని అలాంటి బాబు గారు ఇప్పుడు పెద్దగా నేతలను కలుసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు, సీనియర్ నేతలు ఒక్కో సందర్భంలో అపాయింటె మెట్ లేకున్నా చంద్రబాబును కలిసే అవకాశం ఉందేడదట కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే ప్రచారం పెద్ద ఎత్తున టీడీపీలోనే జరుగుతుంది. కొన్ని సందర్బాల్లో మంత్రులకు సైతం సీఎం చంద్రబాబు అందుబాటులోకి రావడం లేదనే గుసగుసలు ఏపీ సచివాలయంలో వినబడుతున్నాయి.
అసలు చంద్రబాబు ఎందుకు ఇలా మారారు అని టీడీపీ ఇన్నర్ సర్కిల్ లో పెద్ద టాక్ నడుస్తుంది. ఇది చంద్రబాబు వైఖరికి పూర్తి విరుద్ధమని అసలు బాబు గారు ఇలా చేయడమేంటని నేతలు లోలోన గునుక్కుంటున్నారు. ఇటీవల చంద్రబాబును కలుద్దామనుకున్న టీడీపీ నేతలకు పెద్ద షాక్ తగిలిందంట. బాబును కలవడానికి కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదంట. గతంలో ఆనేతలకు వైసీపీపై తీవ్ర స్థాయిలో పోరాడిన చరిత్ర ఉంది. అలాంటి నేతలకు సైతం చంద్రబాబు అపాయింట్ మెంట్ దక్కకపోవడంపై తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. మా అధినేత చంద్రబాబు ఇలా ఎందుకు మారారో తమకు అర్థం కావడం లేదని కొందరు మీడియా ప్రతినిధులతో వాపోయారట. ఇలా చంద్రబాబు పై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
మరోవైపు ఇటీవల ఏపీలో మద్యం టెండర్లు, ఇసుక రవాణా పెద్ద రాజకీయ అలజడిని సృష్టిస్తుంది. ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరి ఎమ్మెల్యేలు ఐతే ఏకంగా తమకు ప్రతి పనిలో పర్సంటేజీలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఇసుక, మద్యం టెండర్లను ఎమ్మెల్యేలు తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పార్టీ, ప్రభుత్వం తీవ్రంగా బద్నాం అవుతుందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేతలు, క్యాడర్ అనుకుంటున్నారట. ఒకప్పుడు చంద్రబాబు ఏది చెబితే అది వేదం లా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే మాటలు వినబడుతున్నాయి. చంద్రబాబుకు ,నేతలకు, క్యాడర్ కు మధ్య ఏదో ఒక గ్యాప్ ఉందని ఆ గ్యాప్ ను సృష్టిస్తుంది ఎవరో మాత్రం తెలియడం లేదని నేతలు అనుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే కొందరి నేతల వాదన మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, ఎప్పటిలాగానే ఉన్నారని మరి కొందరు నేతలు చెబుతున్నారు. కాకపోతే చంద్రబాబు కొత్తగా ఏర్పాటు చేసుకున్న సీఎం పేషీలోని కొందరు వ్యక్తుల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆ నేతలు చెబుతున్నారు. సీఎం పేషీలోని కొందరు వ్యక్తుల ఇటీవల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని దాంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని నేతలు అంటున్నారు. ముక్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక వ్యక్తి వల్ల చంద్రబాబుకు, పార్టీ నేతలకు గ్యాప్ ఏర్పడుతుందని ఇటీవల తరుచూ వినపబడుతుంది. చంద్రబాబును కలవాలని వచ్చిన వారిని సదురు వ్యక్తి సీఎం బిజీగా ఉన్నాడని చెప్పి పంపిస్తున్నారట. ఇలా ఏదో ఒక సారి అనుకుంటే పొరపాటే చాలా సందర్భాల్లో నేతలకు ఇలాంటి అనుభవం ఎదురైందంట. అప్పటి నుంచి ఆ వ్యక్తిపై మంత్రుల నుంచి ముఖ్యనేతల వరకు అందరూ గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
ఇటీవల విజయవాడ వరదలవిషయంలో కూడా కొంత సమాచారాన్ని చంద్రబాబుకు అందజేయడంలో సీఎం పేషీ వైఫల్యం అన్న ప్రచారం కూడా జరిగింది. సీఎం చంద్రబాబుకు సమాచారం చేరవేయడంలో కొంత ఆలస్యం జరిగిందని అప్పటికే పొలిటికల్ గా బాగా డ్యామేజ్ జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ. అంతే కాదు వరదల విషయాన్ని సీఎం పేషీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని టీడీపీ అనుకూల వర్గాలే విమర్శలు గుప్పించాయి. ఈ సీఎం పేషీ కారణంగానే చంద్రబాబు పార్టీ క్యాడర్ దృష్టిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే టాక్ నడుస్తుంది. చంద్రబాబు త్వరగా అలాంటి వ్యక్తుల పట్ల కాస్తా దృష్టి సారించి , విషయాన్ని త్వరగా పరిష్కరించాలని క్యాడర్ కోరుతుంది.లేకుంటే టీడీపీకీ నష్టం కలిగే అవకాశం ఉంటుందని క్యాడర్ అంటోంది. ఎన్నో కష్టాలకు ఓర్చి టీడీపీనీ అధికారంలోకి తెచ్చుకున్నామని అలాంటి తమను చంద్రబాబుకు దూరం చేసే ప్రయత్నాలు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter